Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత విమర్శలు….

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత విమర్శలు….

అమరావతి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని బీజేపీ నేతలే చెప్పారన్నారు. 45 నిముషాలపాటు చర్చలు జరిగాయని వైసీపీ నేతలు అబద్దాలు చెప్పారన్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తోందో అర్థమవుతోందని యనమల అన్నారు. యువత సరైనబాటలో నడవాలని, యువశక్తి సద్వినియోగ పడాలని సీఎం జగన్ అంటున్నారని.. యువత సరైనబాటలో నడవాలంటే అవినీతి మరకలేని యువ నాయకుడు కావాలని అన్నారు.  నిండా అవినీతిలో మునిగిన వ్యక్తి యువతకు ఏం దిశానిర్దేశం చేస్తారని యనమల ప్రశ్నించారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *