Breaking News
Home / Politics / బీజేపీ నేతలపై మండిపడ్డ యనమల

బీజేపీ నేతలపై మండిపడ్డ యనమల

అమరావతి: బీజేపీ నేతలపై ఏపీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు బీజేపీ నేతలు సన్నాయి నొక్కులు నొక్కడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం సక్రమంగా సహకరిస్తే ఏపీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? అని ప్రశ్నించారు. కేంద్రం సహకరించనందువల్లే సొంతంగా నిధులను సమీకరించాల్సి వస్తోందని చెప్పారు. ప్రజలకు సమాధానం చెప్పలేకే బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు కావాలని డీపీఆర్ ఇస్తే.. కేవలం రూ.1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని యనమల ఆరోపించారు.

Check Also

బీజేపీకి ఓటేయమన్న కేంద్ర బలగాలు… మమత సంచలన ఆరోపణ

Share this on WhatsAppఅరాంబాగ్: భారతీయ జనతా పార్టీకి ఓటేయమంటూ కేంద్ర బలగాలు ఆ పార్టీ తరఫున పని చేస్తున్నాయని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *