గుంటూరు: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బందిపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. తాడేపల్లిలోని వైవీ సుబ్బారెడ్డి ఇంటికి పర్చూరు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన ఏబీఎన్ ప్రతినిధిని తోసేసి చిత్రీకరణను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన ఏబీఎన్ సిబ్బందిపై ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు.
