Breaking News
Home / States / Andhra Pradesh / వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తోంది….

వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్వీర్యం చేస్తోంది….

గుంటూరు: ప్రభుత్వ అసమర్థత వల్లే రాజధాని అమరావతి అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని అమరావతిని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. టీడీపీ హయాంలో అన్ని వర్గాల వారితో చర్చించిన తర్వాతే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని గుర్తు చేశారు. రైతులు కూడా చంద్రబాబు పిలుపు మేరకు 33వేల ఎకరాలను భూసమీకరణకు ఇచ్చారని డొక్కా వివరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిలో పనులు ఆపడం, కొత్త కమిటీని నియమించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రాజధాని పనులు ప్రారంభించాలని డొక్కా డిమాండ్‌ చేశారు. లేదంటే ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *