Breaking News
Home / States / Andhra Pradesh / సీఎంను విమర్శించే నైతిక హక్కు వారికి లేదు….

సీఎంను విమర్శించే నైతిక హక్కు వారికి లేదు….

విశాఖపట్నం: శుక్రవారం మద్దిలపాలెంలోని వైసీపీ పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌గాంధీ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సొంత అజెండాను గాలికొదిలేసి టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గాజువాకలో పవన్‌ను నమ్మి 58 వేల మంది ఓట్లు వేస్తే ఓటమి తర్వాత వారిని పట్టించుకోకుండా ఇసుక కోసం బీచ్‌లో మార్చ్‌ చేస్తాననడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌ చేపట్టబోయేది లాంగ్‌మార్చ్‌ కాదని చంద్రబాబు డైరెక్షన్‌లో రాంగ్‌మార్చ్‌ అని విమర్శించారు.

బాబుకు దత్తపుత్రుడిలా..
చంద్రబాబుకు లోకేష్‌ సొంత కుమారుడైతే పవన్‌ దత్తత పుత్రుడని ఎద్దేవా చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఏపీ సీఎం జగన్ తో చర్చలు జరిపితే చంద్రబాబుకు కడుపు మండి ఆయన దత్తతపుత్రుడైన పవన్‌ను రంగంలోకి దించి విమర్శలు చేయిస్తున్నాడన్నారు. వర్థంతికి జయంతికి తేడా తెలియని లోకేష్ కు, ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ కు తేడా తెలియని పవన్‌కు చంద్రబాబు ఇచ్చిన డైరెక్షన్‌ ఇదేనా అని ఎద్దేవా చేశారు. రాజకీయ పరిజ్ఞానం నేర్చుకోవాలని హితవు పలుకుతూ సీఎం జగన్ ను విమర్శించే నైతిక హక్కు వారికి లేదన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *