Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఇసుక కొరతపై టీడీపీ దుష్ప్రచారం…

ఇసుక కొరతపై టీడీపీ దుష్ప్రచారం…

అమరావతి: రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేరు కాబట్టే పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సీఎంగా వచ్చినప్పటి నుంచి వర్షాలు ఎక్కువగా పడి వరద నీరు భారీగా నదులలో చేరుతుండడంతో.. ఇసుక తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుండడంపై మంత్రి మండిపడ్డారు. ఏ అంశంపై మాట్లాడాలో టీడీపీ నేతలకు తెలియక దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలెవ్వరు ఇసుక వ్యాపారం చెయ్యడం లేదని పేర్కొన్నారు. టీడీపీ నేతలు గతంలో ఇసుక దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *