కృష్ణా: కంకిపాడు మండలం మద్దూరులో దసరా ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వైసీపీ కార్యకర్తల దాడిని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోడె ప్రసాద్ ఖండించారు. మద్దూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడి హేయమని చెప్పారు. అమ్మవారి ఊరిగింపులో చొరబడి మహిళలు, కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి చేశారని బోడే ప్రసాద్ ఘటన గురించి వివరించారు. అద్దంకి సురేష్, వెంకటసుబ్బారావు పరిస్థితి విషమంగా ఉందని, దాడికి పాల్పడ్డవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బోడే ప్రసాద్ డిమాండ్ చేశారు.
