గుంటూరు: జిల్లాలోని పల్నాడులో వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. కాటన్ వ్యాపారి ఇంటిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. బ్రాడిపేటలోని ఆతుకూరి కబ్బారావు వైట్ ఫీల్డ్ అపార్ట్మెంట్పై.. వైసీపీ ఎమ్మెల్యే అనుచరులమంటూ మూకుమ్మడి దాడికి దిగారు. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇంట్లో ఉన్న మహిళపైనా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. అయితే అడ్డుకోబోయిన స్థానికులపై కూడా అనుచరులు దాడికి యత్నించారు.
ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో కబ్బారావు కోర్టును ఆశ్రయించారు. ఆయన కోర్టుకు వెళ్లడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుచరులతో కలిసి ప్లాట్ ధ్వంసం చేశారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.