బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై కర్ణాటక విద్యాశాఖ మంత్రి సురేష్‌కుమార్ ఇటీవలే నియమించిన ఓ కమిటీపై సీఎం యెడియూరప్ప స్పందించారు. టిప్పుసుల్తాన్ జ్ఞాపకాలను చెరిపేస్తామని, పాఠ్యపుస్తకాల్లోంచి కూడా వాటిని తొలగిస్తామని ప్రకటించారు. తాను టిప్పు సుల్తాన్‌కు బద్ధ వ్యతిరేకినని యెడియూరప్ప స్పష్టం చేశారు. టిప్పు సుల్తాన్ స్వాతంత్య్ర సమరయోధుడు కాదని, ఆయన జయంతినే కాదు, అసలు ఆయన జ్ఞాపకాలే లేకుండా చేస్తామని యెడియూరప్ప తేల్చిచెప్పారు.
