Breaking News
Home / Film News / నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…

నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…

హైదరాబాద్‌: ‘ఏమైంది ఈవేళ’, ‘సోలో’ చిత్రాలలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు నటి కాజల్‌ సోదరి నిషా అగర్వాల్‌. శుక్రవారం నిషా అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌ సోషల్‌మీడియా వేదికగా నిషాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పలు సందర్భాల్లో నిషాతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ.. ‘నువ్వు పసికందుగా ఉన్నప్పటి నుంచి నువ్వు తల్లిగా మరో బిడ్డకు జన్మనిచ్చినంత వరకూ నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నిషా నువ్వు మంచి అమ్మాయివి. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతం కావాలని కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నిషా హ్యపీ బర్త్‌ డే’ అని కాజల్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నిషా అగర్వాల్‌ ‘థ్యాంక్యూ మై బేబీ లవ్‌ యూ’ అని పేర్కొన్నారు.

 

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *