హైదరాబాద్ : మునిసిపల్ ఎన్నికల విషయంలో దాఖలైన పిటిషన్పై విచారణ పూర్తయ్యేంతవరకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఎన్నికలకు సంబంధించి గతంలో ఎన్నికల కమిషన్ చెప్పిన విధానాన్నే పాటించాలని స్పష్టం చేసింది. ప్రీ ఎలక్షన్స్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకునేందుకు అనుమతించింది. కాగా… ఎన్నికల నిర్వహణకు సంబంధించి దసరా సెలవుల అనంతరం హైకోర్టు మరోసారి విచారించనుంది.
