బిగ్ బాస్ హౌస్ లో హోటల్ టాస్క్ నిన్నటితో పూర్తి అయింది. ఈ హోటల్ కి వచ్చిన గెస్ట్ లు అందరూ హౌస్ ని ఎమోషనల్ కి గురి చేశారు. అయితే ఈ గెస్ట్స్ వారి కంటెస్టెంట్స్ కి హౌస్ లో ఉండాల్సిన జాగ్రత్తలు చెప్తూ, బాగా ఆడాలని కోరుకున్నారు. అయితే ఈ విధంగా సూచనలు చేసిన వారిలో రాహుల్ అమ్మగారు ప్రముఖంగా నిలిచారు. టాస్క్ ల విషయంలో అతన్ని హెచ్చరించడంతో పాటు, బయట అతనికి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పింది.
టాస్క్ లు బాగా ఆడాలని, ఎదుటి వారితో మాట్లాడేటప్పుుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదని, జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పింది. నువ్వే టైటిల్ విన్నర్ అవుతావంటూ తన మనసులో మాటను రాహుల్ కు తెలియజేసింది. అయితే వాళ్ల అమ్మ అన్ని సూచనలు ఇస్తున్నా రాహుల్ గేమ్ గురించి మాట్లాడవద్దు నేను చూసుకుంటాను అన్నాడు. ఇక ఇంటి సభ్యులతో రాహుల్ గురించి చెప్పింది. రాహుల్ చాలా మంచివాడని, మనస్సులో ఏది పెట్టుకోకుండా బయటకి మాట్లాడేస్తాడని చెప్పింది. ఏదైనా తప్పు చేసుంటే ఏమి అనుకోవద్దని అన్నారు. మొత్తానికి రాహుల్ బిగ్ బాస్ విన్నర్ కావాలంటే ఇవి పాటించమని చెప్పారు. మరి రాహుల్ ఆ విషయాలన్ని పట్టించుకుని వాటిని పాటిస్తాడో లేదో చూడాలి.