Breaking News
Home / Film News / ‘రౌడీ’ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న యువ హీరో…

‘రౌడీ’ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న యువ హీరో…

హైదరాబాద్‌: యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ తన లుక్స్‌తో ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ ప్రియులను ఆకట్టుకుంటాడు. ఫ్యాషన్‌లో తనకంటూ ప్రత్యేకమైన ట్రెండ్‌ను సెట్‌ చేసుకున్నాడు ఈ నటుడు. ‘రౌడీ’ బ్రాండ్‌ పేరుతో ఆయన ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈ బ్రాండ్‌ కోసం స్పెషల్‌ ఫొటో షూట్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో విజయ్‌ దేవరకొండ ‘రౌడీ’ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అటు ఫ్యాషన్‌ ప్రియులతోపాటు ఇటు యువత కూడా ఆయన ఫొటోలకు తెగ లైకులు కొడుతున్నారు.

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’ చిత్రాలతో విజయం సాధించారు విజయ్‌ దేవరకొండ. ఈ ఏడాదిలో విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలో ఆయన నటించారు. రష్మిక కథానాయిక. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలో నటిస్తున్నారు. క్రాంతి మాధవ్‌ దర్వకత్వం వహిస్తున్నారు.

మరోమైపు పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ ఓ సినిమా చేయనున్నారు. అంతేకాకుండా ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈ సినిమాకి విజయ్‌ నిర్మాతగా వ్యవహరించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *