Breaking News
Home / States / దిశపై దుష్ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్….

దిశపై దుష్ప్రచారం చేసిన యువకుడు అరెస్ట్….

హైదరాబాద్‌: శంషాబాద్‌ వద్ద హత్యాచారానికి గురైన ‘దిశ’పై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిని నిజామాబాద్‌ జిల్లా  ఫకీరాబాద్‌కు చెందిన శ్రీరామ్‌గా గుర్తించారు. ‘జస్టిస్‌ ఫర్‌ దిశ’పై స్టాలిన్‌ శ్రీరామ్‌ పేరుతో అతడు దుష్ప్రచారం చేస్తుండటంతో హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడిపై సైబర్‌ నేరాలకు చెందిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *