Breaking News
Home / Crime / పెళ్లి చేసుకుంటానని మోసగించి…

పెళ్లి చేసుకుంటానని మోసగించి…

అంబర్‌పేట: సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని మోసగించిన యువకుడిని అంబర్‌పేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైటెక్‌ సిటీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న విశాఖపట్నానికి చెందిన హరీశ్‌ కుమార్‌(32)  తనూష వర్మ(28)కి యూట్యూబ్‌ ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని నమ్మించి నగరానికి రప్పించాడు. శివం రోడ్డులోని ఏవియేషన్‌ కళాశాలలో ఆమె చేరింది. హరీశ్‌కుమార్‌ ఆమెతో పెళ్లికి నిరాకరించి మరో యువతిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి హరీశ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *