శ్రీకాకుళం: పోలాకి మండలం డీఎల్.పురంలో దారుణం జరిగింది. ప్రియుడి చేతిలో ఓ యువతి నిలువునా మోసపోయింది. ఒకే గ్రామానికి చెందిన అబ్బాయి-అమ్మాయి ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత రాత్రి ఆమె మెడలో ప్రియుడు తాళి కట్టాడు. రాత్రంతా ఆమెతో ఉండి.. ఉదయాన్నే ప్రియురాలిని వదిలేసి వెళ్లిపోయాడు. ప్రియుడి చేసిన మోసంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అధికార పార్టీ నేతలు నిందితుడ్ని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు ఆందోళనకు దిగింది.
