రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని పాలమాకుల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పందిని తప్పించబోయి కారు బోల్తా పడటంతో యువకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు వినయ్కిషోర్గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
