Breaking News
Home / National / వరదలపై లాలూ గళమెత్తిన యువకుడు….

వరదలపై లాలూ గళమెత్తిన యువకుడు….

పాట్నా: ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బీహార్‌లో వరదలు పోటెత్తడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధితుల గోడు కళ్లకు కట్టేందుకు పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న కృష్ణ యాదవ్ అనే యువకుడు సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ గొంతును అనుకరిస్తూ సీఎం నితీశ్ కుమార్‌ను నిలదీశాడు. అచ్చం లాలూయే వచ్చి పాలకులను ప్రశ్నించారా అన్నట్టున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

కృష్ణ యాదవ్ ఓ ట్రాక్టర్‌పై నిలబడి మిమిక్రీ చేస్తూ వరద పరిస్థితులను నియంత్రించడంలో నితీశ్ సర్కార్ అసమర్థతపై గట్టిగా నిలదీశాడు. ఈ వీడియో ఇప్పటికే ట్విటర్లో 10 వేల మందికి పైగా లైక్ చేశారు. సదరు యువ విద్యార్ది దగ్గర మంచి టాలెంట్ ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బీహార్‌లో ఇప్పటివరకు 42 మంది మృత్యువాత పడ్డారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *