Breaking News
Home / Crime / యవతిపై యువకుడు లైంగిక దాడి….

యవతిపై యువకుడు లైంగిక దాడి….

మల్కాజిగిరి: ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటమేగాక చంపుతానని బెదిరించిన యువకుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూసఫ్‌గూడకు చెందిన మహ్మద్‌ షాజిద్‌ న్యూట్రీషియన్‌ సంస్థ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నాడు. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని ఆన్‌లైన్‌ ద్వారా అతడిని సంప్రదించింది. తమ ప్రతినిధి ఇంటికి వచ్చి డైట్‌ ప్లాన్‌ వివరాలు తెలియజేస్తారని యువతికి సమాచారం అందింది.  కన్సల్టెంట్‌ మహ్మద్‌ షాజిద్‌ ఆమె ఇంటికి వెళ్లాడు. డైట్‌ ప్లాన్‌ వివరిస్తూనే సదరు యువతిని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతను బాధితురాలికి ఫోన్‌ చేసి ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే యాసిడ్‌ పోసి చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, షాజిద్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *