Breaking News
Home / States / వరంగల్ వాసి మేడ్చల్ లో ఆత్మహత్య….

వరంగల్ వాసి మేడ్చల్ లో ఆత్మహత్య….

మేడ్చల్: వరంగల్ జిల్లా నెక్కొండ మండలం తోఫాన్‌పల్లి గ్రామానికి చెందిన మహేష్‌రెడ్డి(27) అనే యువకుడు కొంతకాలంగా నాగారంలోని ఎస్వీ నగర్‌లో నివాసముంటున్నాడు. ఏఎస్ రావు నగర్ ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ సమీపంలో మహేష్ రెడ్డి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *