Breaking News
Home / States / ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక…

ప్రియురాలి వివాహాన్ని జీర్ణించుకోలేక…

భువనగిరి: ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరిలోని గ్రామశివారులో చోటుచేసుకుంది. బీహార్‌ రాష్ట్రానికి చెందిన సుధీర్‌కుమార్‌(22) మండల పరిధిలోని ఓ కోళ్లపారంలో ఏడాదినుంచి పని చేస్తున్నాడు. ఇదే కోళ్లఫారంలో బీహార్‌కు చెందిన డోలి కుమారి, జ్యోతి, రాజులు పనిచేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన డోలి కుమారి, జ్యోతి, వారి సొదరుడు రాజు ఒకే గదిలో ఉంటున్నారు. అ గదికి సమీపంలోనే సుధీర్‌కుమార్‌ నివాసం ఉండేవాడు. సుధీర్‌కుమార్, జ్యోతిల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కాగా జ్యోతి, ఆమె సొదరుడు రాజు 25 రోజుల క్రితం  బీహార్‌కు బయాలుదేరి వెళ్లారు. బీహర్‌కు వెళ్లిన జ్యోతికి 10 రోజుల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది.

ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను డోలికుమారికి పంపింది. అ ఫొటోలను చూసిన సుధీర్‌కుమార్‌ కొద్ది రోజుల నుంచి మానసికంగా కుంగిపోయాడు. తను ప్రేమించిన యువతి మారొకరితో వివాహం చేసుకోవడాన్ని భరించలేక మానస్తాపం చెంది తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోళ్లఫారం సూపర్‌ వైజర్‌ కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *