నిజామాబాద్ : రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని యువకుడు నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతనికి శారీరకంగా దగ్గరైంది. దీంతో సదరు యువతి గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న యువకుడు యువతికి అబార్షన్ చేయించేందుకు ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లాడు. వైద్యం చేస్తుండగా వికటించి యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
