Breaking News
Home / States / Telangana / మూడు రోజుల పాటు మీ -సేవా కేంద్రాలు బంద్‌..

మూడు రోజుల పాటు మీ -సేవా కేంద్రాలు బంద్‌..

నిజామాబాద్‌: రేపటి నుంచి మరో మూడు రోజుల వరకు మీ సేవా కేంద్రాలు పనిచేయవని నిజామాబాద్‌ జిల్లా ఈడీఎం కార్తీక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మీ-సేవా డేటా బేస్‌ కార్యకలాపాలను మెరుగుపర్చనున్న కారణంగా ఈ విరామం ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 13 డిసెంబర్‌ రాత్రి 7 గంటల నుంచి 16 డిసెంబర్‌ ఉదయం వరకు మీ సేవా కేంద్రాలు బందుంటాయని సమాచారం. తిరిగి డిసెంబర్‌ 16 ఉదయం 8 గంటల నుంచి మీ సేవా కేంద్రాల సేవలు అందుబాటులోకి వస్తాయనీ, అందుకు గాను ప్రజలందరూ సహకరించాలని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

నేటి నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌

Share this on WhatsAppఆదిలాబాద్: కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా వాంకిడి మండల కేంద్రంలో గురువారం నుంచి వారం రోజుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *