Breaking News
Home / Crime / రేపు సిట్‌ ముందుకు వైఎస్ అవినాష్…..

రేపు సిట్‌ ముందుకు వైఎస్ అవినాష్…..

బ్రేకింగ్ న్యూస్:మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సిట్ బృందం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నిస్తోన్న సిట్ బృందం తాజాగా వైఎస్ కుటుంబసభ్యుడు, వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో శనివారం అవినాష్, సిట్ అధికారుల ముందు హాజరవ్వనున్నారు. ఈ క్రమంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దీనిపై దర్యాప్తుకు ఓ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ బృందాన్ని మార్చేసి కొత్త సిట్‌ను ఏర్పాటు చేశారు. మొదట్లో దర్యాప్తులో ఈ బృందం కాస్త నిదానించినా.. ఆ తరువాత వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో అనుమానితులతో పాటు వైఎస్ కుటుంబసభ్యులను, పలువురు టీడీపీ, వైసీపీ నేతలను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబసభ్యులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను సిట్ బృందం విచారించిన విషయం తెలిసిందే. వారితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు విచారించారు. ఇక మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డికి కూడా ఈ కేసులో నోటీసులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Check Also

కళ్లు మూసుకుపోయిన కామాంధుడు.. ఆవుపై అఘాయిత్యం

Share this on WhatsAppకామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. పశువులు కూడా సిగ్గుపడేలా వ్యవహరించాడు. మూగజీవి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *