నెల్లూరు: వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దాడి చేశారు. కల్లూరిపల్లిలోని ఆమె ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారని, లేఅవుట్‌కు అనుమతులు ఇవ్వనందుకే ఈ దాడికి పాల్పడినట్టు సరళ ఆరోపించారు. ఇంటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడం, నీటి పైపులైనును ధ్వంసం చేయడమే కాకుండా కేబుల్ వైర్లను సైతం ముక్కలు చేశారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు సరళ వెళ్లగా అక్కడ ఉన్నది కేవలం ఒక్క కానిస్టేబులేనని తెలియడంతో ఆమె స్టేషన్ బయటే బైఠాయించారు. సీఐ లేదా ఎస్సై వచ్చేదాకా ఆమె అక్కడే బైఠాయిస్తానని వెల్లడించారు. ఆమెకు గ్రామ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు.