Breaking News
Home / States / Andhra Pradesh / ‘చంద్రబాబుపై వైసీపీ నేత పద్మ విమర్శలు …

‘చంద్రబాబుపై వైసీపీ నేత పద్మ విమర్శలు …

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు అవినీతి, పుట్టలు బద్ధలవుతున్నాయని వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను కూల్చివేస్తే.. టీడీపీ నేతలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమాలను చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీశారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని మండిపడ్డారు. రూ.18 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిఉందని, టీడీపీ నేతలు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మరో 25 ఏళ్లు టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశంలేదని ఎద్దేవాచేశారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని, బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని, ఆ విషయం బీజేపీ నేత పురందేశ్వరి మర్చిపోయినట్లు ఉన్నారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

Check Also

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *