తిరుపతి: జీ తెలుగు జూనియర్ ఆర్టిస్ట్ గోకుల్ సాయి కృష్ణ(10) డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఏవి నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలిల రెండవ కుమారుడు గోకుల్‌కు రెండు రోజుల నుండి జ్వరం వస్తుండటంతో బెంగళూరులోని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి గోకుల్ మృతి చెందాడు.
